ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆదివారం రాజ్క్ నివాస్‌లో ఎల్‌జీ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామాను అందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు భారీ షాక్ తగిలిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆమె కల్కాజీలో 3,521 ఓట్ల తేడాతో విజయ సాధించారు. అయితే ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) మొత్తంగా 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఓడిపోయారు.